TTD: శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్ - టోకెన్లు ఇలా..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నూతన పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా గతంలో అమలు చేసి రద్దు చేసిన స్థానికులకు ప్రత్యేక దర్శన కోటా పునరుద్దరణకు నిర్ణయించింది. అందులో భాగంగా ఈ డిసెంబర్ 3న అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. టోకెన్ల పంపిణీ పైన స్పష్టత ఇచ్చింది.
ప్రత్యేక దర్శనం
టీటీడీ నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా స్థానికులకు ప్రతీ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇందు కోసం రేపు డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

స్థానికులకు అవకాశం
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలిపింది. టీటీడీ పాలక నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నంచే అమలుకు శ్రీకారం చుట్టింది .గతంలో ఈ విధానం అమల్లో ఉండేది. మధ్యలో నిలిపివే యటంతో స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్ధన మేరకు తిరిగి పునరుద్దించారు. ఈ నిర్ణయం పైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం
ఇక, వచ్చే జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు పది రోజులపాటు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications