తిరుమల మెట్ల మార్గంలో చిరుతల కట్టడికి టీటీడీ నిర్ణయాలు- భక్తుల చేతికి..!!

Tirumala: తిరుమలలోని అలిపిరి, శ్రీవారి మెట్లమార్గాలు, ఘాట్ రోడ్లల్లో ఇటీవలి కాలంలో వన్యమృగాలు- ముఖ్యంగా చిరుతల సంచారం, వాటి కదలికలు పెరగడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. వాటి కట్టడికి, భక్తుల భద్రతపై నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుమలలోని గోకులంలో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటైంది. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొన్నారు. టీటీడీ అటవీ, వివిధ విభాగాలతో పాటు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.

TTD review on increased movements of wild cats in Tirumala

⁠అలిపిరి మెట్ల మార్గంలో భ‌క్తుల భ‌ద్ర‌త‌కు అద‌న‌పు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. పరిస్థితులకు అనుగుణంగా వారిని ⁠అప్ప‌టిక‌ప్పుడు అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు, ఘాట్ రోడ్లలల్లో విధులు కేటాయిస్తారు. ఆరోగ్య‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్త‌ను తొల‌గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్యం, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో న‌డ‌క‌మార్గంపై నిరంతరం జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు ఈ సందర్భంగా నిర్ణయించారు. వన్యప్రాణుల సంచారంపై తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్, అటవీ శాఖల సహకారం తీసుకున్నారు.⁠

⁠అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు.⁠ ⁠నిషేధిత ఆహార పదార్థాల అమ్మకాలపై దుకాణాలపై ఆంక్షలు విధించడం, వాటి యజమానులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

⁠అలిపిరి మెట్ల మార్గంలో రెండున్నర కిలో మీటర్ల పొడవు ఉన్న 7వ మైలు నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పించడం, చిరుతలు- ఇతర వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచనున్నారు. ⁠ప్రతి నెల మానవ-వన్యప్రాణి ఘర్షణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షిస్తారు.

ఈ స‌మావేశంలో వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ కృష్ణమూర్తి, చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్‌ సెల్వం, డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, టీటీడీ డీసీఎఫ్‌ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, వెంకటేశ్వరులు, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్, వీజీవో సురేంద్ర, అలిపిరి ఏవీఎస్ఓ రమేష్ కృష్ణన్ పాల్గొన్నారు.

రెండు రోజుల కిందటే అలిపిరి కాలిమార్గంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. భయంతో భక్తులు పరుగులు తీశారు. టీటీడీ భద్రత సిబ్బంది- అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులు పంపించారు.

భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని ఈ మార్గంలో అనుమతించకూడదని ప్రాథమికంగా నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది అలిపిరి నడకమార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+