టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు.. కారణం అదే..
టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. ప్రతి వారం రాజశేఖర్ బాబు పుత్తూరు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబుని ఈఓ శ్యామలరావు సస్పెండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పుత్తూరులోని ఓ చర్చిలో ప్రార్థనలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణలో తేలింది.
ఇదే విషయంపై పుత్తూరు పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఏఈఓ రాజశేఖర్ బాబుని ఈఓ శ్యామలరావు సస్పెండ్ చేశారు.

దశాబ్దం కాలంగా టీటీడీలో స్వీపర్ స్థాయి నుంచి డిప్యూటీ ఈఓ స్థాయి వరకు ఉన్న అన్యమత ఉద్యోగస్తులను టీటీడీ ఛైర్మన్ బదిలీ చేశారు. చైర్మన్ సహా సభ్యులందరూ ధార్మిక కార్యక్రమాలు, తిరుమల పవిత్రతకే మా ప్రథమ బాధ్యత అని ప్రకటించారు.












Click it and Unblock the Notifications