గుట్టుచప్పుడు కాకుండా: ఎట్టకేలకు లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ తీసుకున్న టిటిడి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు లడ్డూ ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్‌ను తీసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ లైసెన్స్ తీసుకుందని అంటున్నారు.

గతంలో లడ్డూకు లైసెన్స్ తీసుకోవడానికి టిటిడి నిరాకరించింది. లడ్డూ అనేది ప్రసాదం అని, ఇది ఆహార పదార్థం కాదని కాబట్టి దీనికి లైసెన్స్ అవసరం లేదని చెప్పింది. అంతేకాదు దీనిని ఉచితంగా, రాయితీకి ఇస్తామని చెప్పింది.

TTD Takes FSSAI Licence For Laddu

కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐ మాత్రం కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని చెప్పింది. అధికారులు లడ్డూ తయారు చేసే ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయగా టిటిడి నిరాకరించింది. అయితే, తాజాగా టిటిడిపి సేఫ్టీ పర్మిషన్ తీసుకోవడం గమనార్హం.

కాగా, బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు లడ్డూ ప్రసాదం తయారీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirumala Tirupati Devastanam get licence for Laddu Prasadam from Food security authority of india.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి