TTD: తిరుమల కిటకిట.. రోడ్లపై 3కిలోమీటర్ల మేర భక్తుల బారులు.. దర్శన సమయం ఎంతంటే!!

ఏడుకొండలపైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో, ప్రస్తుతం వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో, అంతేకాదు వారాంతం నేపథ్యంలో తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక భక్తులు రోడ్లపై మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు.

తిరుమల కిటకిట
శనివారమే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగగా, ఆదివారం నాడు ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్ లతోపాటు రింగు రోడ్డు మీదుగా అక్టోపస్ భవనం వరకు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరి ఎదురుచూస్తున్నారు.

TTD Tirumala rush devotees in queue lines for 3kilometers 24 hours for sarva darshan

భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు
ఇక తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ టీటీడీ చర్యలు చేపట్టింది. మరికొన్ని రోజులపాటు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుందని టిటిడి భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం జెఈఓ వీరబ్రహ్మం, తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

నిన్న తిరుమలలో రద్దీ ఇలా
అయితే ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతున్న రద్దీ నేపథ్యంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలని భావించేవారు తిరుమలకు ఇప్పుడు వస్తే ఇబ్బంది పడతారని ఈ విషయాన్ని భక్తులందరూ గమనించాలని చెబుతున్నారు. కాస్త రద్దీ తగ్గాక తిరుమలకు రావటానికి ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న తిరుమలలో 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 43 వేల 1999 మంది తలనీలాలు సమర్పించారు.

సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు కాగా, నిన్న క్యూ కాంప్లెక్స్ లు అన్ని నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు దర్శించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టిందని టిటిడి అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+