TTD: మళ్ళీ రూ.100కోట్లు దాటి.. తగ్గేదేలేదంటున్న తిరుమల శ్రీవారు!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువు తీరిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోమారు 100కోట్ల మార్కును దాటి శ్రీవారి పట్ల భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. వరుసగా 33 వ నెల తిరుమల శ్రీవారి ఆదాయం 100 కోట్ల మార్కును దాటింది. కరోనా మహమ్మారి కాలంలో స్వామివారి హుండీ ఆదాయం తగ్గగా ఆ తర్వాత 2022 మార్చి నెల నుంచి ప్రతినెల 100కోట్ల మార్కును దాటుతూ వస్తోంది.
ఇప్పటివరకు తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం ఎంతంటే
అయితే ప్రస్తుతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం స్వామివారికి వస్తున్న కానుకలు కొంత తగుముఖం పట్టినప్పటికీ, హుండీ ఆదాయం మాత్రం భారీగానే వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు తిరుమల శ్రీవారికి 1253 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. తిరుమల శ్రీవారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులను ప్రదర్శించే భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే క్రమంలో భాగంగా హుండీలో కానుకలను సమర్పిస్తారు.

నెలకి 100 కోట్లకు పైగా శ్రీవారి హుండీ ఆదాయం
ఈ హుండీలలో సమర్పించే కానుకల ద్వారా స్వామివారికి ప్రతిరోజు మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం లభిస్తుంది. దీంతో నెలకి 100 కోట్లకు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుంది. ఇక సంవత్సరానికి హుండి ఆదాయం చూస్తే 1300 కోట్లను దాటే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరి నుండే వంద కోట్లను దాటేసిన హుండీ ఆదాయం
ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1253 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, ఈ డిసెంబర్ నెలలో కూడా కలిపితే స్వామివారి హుండీ ఆదాయం 1360 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం జనవరి నెలలో స్వామివారికి 116 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రాగా, ఫిబ్రవరి నెలలో 112 కోట్లు మార్చి నెలలో 118 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.
తగ్గేదేలే అంటున్న శ్రీవారు
ఏప్రిల్ నెలలో 101 కోట్లు, మే నెలలో 108 కోట్లు, జూన్ నెలలో 114 కోట్లు, జూలై నెలలో 125 కోట్లు, ఆగస్టు నెలలో 126 కోట్లు, సెప్టెంబర్ నెలలో 114 కోట్లు, అక్టోబర్ నెలలో 127 కోట్లు, నవంబర్ నెలలో 111 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం రాగా తిరుమల శ్రీవారు సంపాదనలో తగ్గేదే లేదని మరోమారు నిరూపించుకున్నారు.












Click it and Unblock the Notifications