TTD: టీటీడీ బోర్డు కీలక భేటీ- వైకుంఠ ద్వార దర్శనం, టికెట్ల జారీలో మార్పులు..!!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. ఇక, ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు తెరవాలా.. తగ్గించాలా అనే అంశం పైన చర్చ జరుగుతోంది. దర్శన టికెట్ల జారీ పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సారి కీలక మార్పుల దిశగా ప్రతిపాదనలు అందుతున్నాయి.

దీపావళి వేళ శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, అధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా, శ్రీ మలయప్పస్వామి,శ్రీ-భూ అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు నిర్వహించాలనేది చర్చగా మారింది. కొందరు స్వామీజీలు ఇప్పటికే ఈ మేరకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ttd-to-decide-vaikunta-ekadasi-darshan-dates-in-28th-board-meeting

ప్రతీ ఏటా ఈ ఉత్తర ద్వార దర్శనాలు కొన్ని ఏళ్లుగా పది రోజుల పాటు తెరిచి ఉంచుతున్నారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 31 న వైకుంఠ ఏకాదశి రోజు తెలుసుకోనున్న వైకుంఠ ద్వారాలు పది రోజులపాటు తెరిచి ఉంచాలా.. లేదంటే కొందరు చేస్తున్న సూచనల మేరకు ముక్కోటి ఏకాదశి ద్వాదశి రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచాలా... అదే దాని పై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన అపశృతిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. తాజాగా శ్రీనివాసానంద సరస్వతీ ఇదే విషయం పైన స్పందించారు. ఎవరైనా వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే దర్శించుకోవాలని తేల్చి చెప్పారు. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు ఉండదని స్పష్టం చేశారు.

2020 కంటే ముందు తిరుమలలో కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అదే విధానం అమలు చేస్తున్నారు. అయితే.. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద చోటు అపశృతి చోటు చేసుకుంది. దీంతో, టికెట్ల విషయంలో మార్పు చేయాలని ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. మరో వైపు డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండు రోజులు ఏకాదశి ద్వాదశి పర్వదినాలు కావడం మరోవైపు నూతన సంవత్సరం తొలి రోజున భక్తుల తాకిడి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో.. ఈ నెల 28న జరిగే బోర్డు సమావేశంలో టీటీడీ రానున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల జారీ.. భక్తుల రద్దీ.. ఏర్పాట్ల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+