TTD: శ్రీవారి దర్శనం, వసతి గదుల కోటా విడుదల - కీలక మార్పులు..!!

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత నూతన ఈవోగా శ్యామలరావును నియమించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే భక్తుల సౌకర్యాలు..ప్రసాదం నాణ్యతతో పాటుగా దివ్య దర్శనం టోకెన్ల పునరుద్దరణ పైన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి నియామకం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో దర్శనం.. వసతి గదుల ఆన్ లైన్ కోటా ను విడుదల చేస్తున్నారు.

దర్శనం - వసతి కోటా
ఈ రోజున సెప్టెంబర్ మాసానికి సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. వీటిని 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా ఈ రోజు మధ్నాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక, ప్రతీ నెలా విడుదల చేసిన విధంగానే... ఈ నెల 27న తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

TTD to release online quota of Darshan today for the month of Septmber

దివ్య దర్శనం టోకెన్లు
టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు కోరారు. ఇక.. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్దరిస్తూ అధికారులు నిర్ణయించారు. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ జరిపారు. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో తప్పనిసరిగా టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించారు. లేనిపక్షంలో స్వామివారి దర్శనానికి అనుమతించమని టీటీడీ ప్రకటించింది. గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకొని భక్తులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి.

టీటీడీలో కీలక నిర్ణయాలు
దీనిని ఆసరాగా తీసుకుని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ శ్యామల రావు, పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ చేస్తామని వెల్లడించారు. త్వరలో 6వేల టోకెన్లకు పెంచనున్నట్టు సమాచారం. తాజా నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానం దళారులకు చెక్ పెట్టింది. టీటీడీకి నూతన ఛైర్మన్ తో పాటుగా పాలక మండలి సభ్యుల పైన కసరత్తు కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే నూతన ఛైర్మన్ నియమాకం జరగునంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+