26న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం టీటీడీ దర్శన టికెట్లు
తిరుపతి: సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త తెలిపింది. వారి కోటా కింద నవంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శనం టికెట్లను అక్టోబర్ 26న మధ్యాహ్నం 3 గంటలకు విడుల చేయనున్నట్లు పేర్కొంది.
శ్రీవారి
భక్తులు
ఈ
అవకాశాన్ని
సద్వినియోగం
చేసుకోవాలని
టీడీపీ
కోరింది.
అయితే,
అడ్మినిస్ట్రేటివ్
కారణాల
వల్ల
ప్రత్యేక
దర్శనం
టికెట్ల(రూ.
300)ను,
తిరుమల
అకామిడేషన్
డిసెంబర్
కోటాను
అక్టోబర్
26వ
తేదీన
ఉదయం
10
గంటలకు
విడుదల
చేయనున్నారు.
వాస్తవానికి ఈ టికెట్లను అక్టోబర్ 27న విడుదల చేయాల్సి ఉంది. భక్తుల సౌకర్యార్థం ఒక్కరోజు ముందుగానే విడుల చేస్తున్నారు.

సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు దర్శనం కోసం టికెట్లు తీసుకోవాలంటే..
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలి
వయో పరిమితి 65 సంవత్సరాలకుపైగా ఉండాలి
ఐడీ ఫ్రూప్‌గా ఆధార్ కార్డు ఉండాలి
ఉచితంగా దర్శన టికెట్
సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే)
అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి
80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి.