TTD: శ్రీవారి సేవ చేసే భాగ్యం - టీటీడీ తాజా నిర్ణయం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనంతో పాటుగా సేవల కోసం భక్తులు ముందస్తుగానే టికెట్లు అందిస్తున్నారు. స్వామి వారి దర్శనమే కాకుండా ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. అందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం కోసం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఆన్ లైన్ విధానంలో భక్తులకు జారీ చేయనున్నారు.

సేవా టికెట్లు
జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు ఈ నెల టీటీడీ విడుదల చేసింది. వీటిలో కొన్నింటిని ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌ కోటా కింద ఆన్​లైన్​ నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా, రేపు (22వ తేదీ) ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లను సైతం అందుబాటులోకి తేనున్నారు.

TTD to Release srivari Arjitha seva and Darshan tickets from today

దర్శనం, వసతి
అక్టోబర్​ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.ఈ నెల 24న కూడా జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్‌ కోటా కూడా అందుబాటులోకి రానుంది.

టీటీడీ సూచన
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోసం భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+