ఈ ఏడాది తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఎన్ని రోజులు.. కీలక ప్రతిపాదనలు..!!
Tirumala: తిరుమలలో ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకత ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు ప్రముఖులు తిరుమలకు చేరుకుంటారు. కాగా, ఈ సంవత్సరం తిరుమలలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం లో కీలక మార్పులకు అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది చోటు చేసుకున్న ఘటనలతో టికెట్ల జారీ..అదే విధంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు నిర్వహించాలనేది చర్చగా మారింది. కొందరు స్వామీజీలు ఇప్పటికే ఈ మేరకు కొన్ని సూచనలు చేస్తున్నారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఆ పర్వదినాన శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రతీ ఏటా ఈ ఉత్తర ద్వార దర్శనాలు కొన్ని ఏళ్లుగా పది రోజుల పాటు తెరిచి ఉంచుతున్నారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 31 న వైకుంఠ ఏకాదశి రోజు తెలుసుకోనున్న వైకుంఠ ద్వారాలు పది రోజులపాటు తెరిచి ఉంచాలా.. లేదంటే కొందరు చేస్తున్న సూచనల మేరకు ముక్కోటి ఏకాదశి ద్వాదశి రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచాలా... అన్నదానిపై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన అపశృతిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

తాజాగా శ్రీనివాసానంద సరస్వతీ ఇదే విషయం పైన స్పందించారు. ఎవరైనా వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే దర్శించుకోవాలని తేల్చి చెప్పారు. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు ఉండదని స్పష్టం చేశారు. 2020 కంటే ముందు తిరుమలలో కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అదే విధానం అమలు చేస్తున్నారు. అయితే.. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద చోటు అపశృతి చోటు చేసుకుంది. దీంతో, టికెట్ల విషయంలో మార్పు చేయాలని ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి.
మరో వైపు డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండు రోజులు ఏకాదశి ద్వాదశి పర్వదినాలు కావడం మరోవైపు నూతన సంవత్సరం తొలి రోజున భక్తుల తాకిడి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో.. తదుపరి బోర్డు సమావేశంలో టీటీడీ రానున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల జారీ.. భక్తుల రద్దీ.. ఏర్పాట్ల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్నట్లుగా పది రోజులు కొనసాగించాలా.. లేక, రెండు రోజులకే వైకుంఠ ద్వార దర్శనం పరిమితం చేయాలా అనేది బోర్డు సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications