TTD: రేపు తిరుమలలో చిన్నారుల కోసం ఈ కార్యక్రమం; భక్తులూ.. అస్సలు మర్చిపోవద్దు!!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి కోసం టీటీడీ ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే వివిధ కార్యక్రమాల విశేషాలను అందిస్తూనే ఉంటుంది. ఇదే క్రమంలో స్వామి వారిని దర్శించుకునే వారు వారి చిన్నారుల కోసం రేపు తిరుమలలో కొనసాగే కార్యక్రమం వివరాలను అందించింది టీటీడీ.
దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా రేపు తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుందని టీటీడీ పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం మార్చి 3న ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాబట్టి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సంబంధించిన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని టిటిడి సూచించింది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1 మరియు 2, కొత్త బస్టాండ్ ప్రాంతాలలో పోలియో చుక్కలు వేయనున్నారు.
అంతేకాదు హెల్త్ ఆఫీస్, విక్యూసి 1 మరియు 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేయనున్నట్టు టిటిడి వెల్లడించింది.
ఇందులో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో నేడు ఉదయం 10.30 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ కూడా నిర్వహించి పల్స్ పోలియోపై అవగాహన కల్పించారు . అంతేకాదు తిరుమలకు వచ్చిన భక్తులకు తెలిసేలా ప్రచారం కూడా చేయించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications