తిరుమలకు వచ్చే భక్తుల నిరీక్షణకు చెక్ - ఇక నుంచి మరింత వేగంగా..!!
Tirumala: తిరుమల కు వచ్చే భక్తుల కోసం కీలక సర్వే మొదలైంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల పెంపు పైన ప్రత్యేకంగా ప్రభుత్వం..టీటీడీ.. తుడా ఫోకస్ చేసాయి. అందులో భాగంగా అలిపిరి కేంద్రంగా బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం TUDA కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. దీంతో, పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు అనుగుణంగా రోడ్లు.. రవాణ వ్యవస్థలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా TUDA(తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) తాజాగా తిరుపతికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. తిరుమల-తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యలు అన్నింటికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతికి ఓఆర్ఆర్ ఏర్పాటుకు తుడా ఆధ్వర్యంలో సర్వే ప్రారంభించారు. తిరుపతి భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం తుడా ఔటర్‌రింగ్ రోడ్డు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది.

తిరుపతి ఔటర్ రింగ్ రోడ్డు తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాల పేట మండలాలను కలుపుతూ నిర్మాణం చేయనున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్డు పేరుతో (ఔటర్ రింగ్ రోడ్డు) నిర్మాణానికి సర్వే ప్రారంభించారు. గతంలో సీఎం చంద్రబాబు వైకుంఠమాల పేరుతో చేపట్టదలచిన ఓఆర్ఆర్ ప్రతిపాదనలకు తిరిగి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కువగా వినియోగిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై తుడా అధికారులు దృష్టి సారించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గనక తిరుమలకు వచ్చే వాహనాలు నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది అందు బాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. మొత్తం 90 కిలోమీటర్ల పరిధిలో ఓఆర్ఆర్ రూపొందించనున్నారు.












Click it and Unblock the Notifications