మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయొద్దు.!జగన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విజ్ఞప్తి.!
అమరావతి/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసి రెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాజకీయాల్లో వస్తున్న మార్పులు, గతంలో రాజకీయ నాయకుల విజ్ఞత, రాజకీయ స్పూర్తి, న్యాయ స్థానాల తీర్పుల పట్ల గైరవం వంటి అంశాలపై తనదైన శైలిలో విష్లేశించారు తులసిరెడ్డి. దాంతో పాటు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల మీద ఘాటు వ్యాఖ్యలు చేపారు. అధికార పార్టీలు ప్రతీకార రాజకీయాల మీద దృష్టి సారించకుండా పరిపాలన మీద శ్రద్ద వహిస్తే ప్రజల్లో సానుకూలత పెరిగే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు.

మంగళవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొన్ని వార్తా ఛానళ్లపై రాజద్రోహం కేసులు పెట్టడం సమంజసం కాదని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించడం హర్షనీయమని చెప్పారు. అంతే కాకుండా ఏలూరు మెడికల్ కాలేజీకి మూడుసార్లు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019 ఫిబ్రవరిలో తొలిసారి చంద్రబాబు, 2019 అక్టోబర్ 4న రెండోసారి జగన్, 2021 మే 31వ తేదీన ముచ్చటగా మూడోసారి జగన్ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి మిగతా వైద్య కళాశాలలకు రాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్త పడాలన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి దిగ్భ్రాంతికరమన్నారు తులసి రెడ్డి. ఆయన నీతి, నిజాయితీకి నిలువుటద్ధం అని కొనియాడారు. నీలం సంజీవరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా తులసిరెడ్డి నివాళులర్పించారు. కోర్ట్ ఒక్కసారి ప్రతికూల వ్యాఖ్యలు చేసినందుకే సీఎం పదవికే రాజీనామా చేశారని, కానీ నేటి నాయకులు కోర్టులు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా పట్టించుకోరని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications