సిగ్గేస్తోంది, పురుగులమందు తాగాలనిపిస్తోంది: తుమ్మల
హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనకు పురుగుల మందు తాగాలని అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం అన్నారు. షైనింగ్ ఇండియా ఇన్ఫోమీడియా ప్రయివేట్ లిమిటెడ్(న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో ప్రజాసేవా రంగంలో పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో తమ్మల నాగేశ్వర రావుకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనకు సిగ్గేస్తోందన్నారు. సమాజం రాజకీయ నాయకులను ఇంత అసహ్యంగా చిత్రీకరిస్తుంటే ఇంకా రాజకీయాల్లో ఉండాలా అనే ఆలోచన వస్తోందన్నారు.
రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పురుగుల మందు తాగాలనిపిస్తోందన్నారు. తన దగ్గర ఆ రోజు డబ్బు లేదని, ఇప్పుడు లేదంటే ఎవరు నమ్మరని అన్నారు. కాను తాను చెప్పిందే వాస్తవం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అహ్మద్ బలాలా, కన్నబాబా, ఆకుల రాజేందర్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

కాగా, ప్రజాసేవా రంగంలో రంగంలో కృషి చేసి ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యేలకు 13వ షైనింగ్ ఇండియా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది.












Click it and Unblock the Notifications