బాబుకు షాక్: తెరాసలోకి తుమ్మల నాగేశ్వరరావు?

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వనున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల గత కొం తకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి దూరంగా వుంటూ వస్తున్నారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో కూడా సంబంధాలు దెబ్బ తిన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన టిడిపి మహానాడుకు కూడా డుమ్మా కొట్టిన తుమ్మల నాగేశ్వర్‌ రావును తమ పార్టీలోకి రావాల్సిందిగా తెరాస నాయకత్వం చేస్తున్న ప్రయ త్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి తోపాటు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సమ్మతించినట్టు రాజకీయవర్గాలం టున్నాయి.

Tummala may jump into TRS

ఈ సమాచారంతో అప్రమత్తమైన టిడిపి నాయకత్వం తుమ్మల వద వద్దకు కొందరు సీనియర్‌ నాయకులను రాయబారం పంపింది. అయినప్పటికీ సానుకూలమె న స్పందన రాలేదని సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి కమ్మ సామాజికవర్గం నుంచి పార్టీకి ప్రాతినిధ్యం లేదని, తుమ్మల రాకతో ఆ వెలితి కూడా తీరినట్టు అవుతుందనే యోచనలో తెరాస నాయకత్వం వుంది.

గత సాధారణ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడి పోయారు. అయితే తనకంటే పార్టీలో జూనియర్‌ అయిన ఖమ్మం మాజీ లోక్‌ సభ సభ్యుడు నామా నాగేశ్వర్‌రావుకు పార్టీ అధినాయకత్వం ప్రాధాన్యత ఇవ్వ డాన్ని తుమ్మల తప్పుబడుతున్నారు. తుమ్మల నాగేశ్వర రావు చేరితే ఖమ్మం జిల్లాలో తెరాస బలం పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+