ముంబైలో బందరు టెక్కీ హత్య: కేసు కీలక మలుపు
ముంబై/ విజయవాడ: ముంబైలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన తెలుగు అమ్మాయి అనూహ్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనూహ్యను హత్య చేసింది ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహం లభించిన రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు క్యాబ్ డ్రైవర్లను విచారిస్తున్నారు. అనూహ్యను హత్య చేసిన తర్వాత హంతకులు మృతదేహం వాసన రాకుండా కెమికల్స్ చల్లినట్లు గుర్తించారు. హంతకులు వాటికి ఎక్కడ కొన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసు మిస్టరీ చేధిస్తామని పోలీసులు తెలిపారు.

ముంబై అత్యంత దారుణంగా మృతి చెందిన అనూహ్య కేసు విచారణకు రైల్వే పోలీసులే స్పందించారని, ముంబై పోలీసులు ఏ మాత్రం సహకరించలేదని అనూహ్య తండ్రి ప్రసాద్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. నాలుగు రోజుల మమ్మల్ని పట్టించుకోదని, తమ బంధువుల సహాయంతోనే మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రసాద్‌రావు వినతి చేశారు.
ముంబైలో అత్యంత దారుణంగా హత్యకు గురైన అనూహ్య మృతదేహం శనివారం ఉదయం స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చేరుకుంది. అనూహ్య మృతదేహం చూసిన వెంటనే తల్లి జ్యోత్స్య సొమ్మసిల్లిపడిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు, అక్కడిప్రాంత వాసులు అక్కడికి చేరుకుని అనూహ్యకు నివాళి అర్పించారు. అనూహ్య అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పెద్ద యెత్తున ప్రజలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications