తండ్రీకూతుళ్ల మధ్య టీవీ చిచ్చు: అల్లుడికి కత్తిపోట్లు
హైదరాబాద్: టీవీ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. క్షణికావేశం ఎంత దారుణానికైనా తెగబడేలా చేస్తుందనే దానికి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఒక సంఘటనే కారణం. టీవీ చానెల్స్ చూసే విషయంలో తండ్రీ కూతురు మధ్య ఏర్పడిన గొడవ.. చివరకు అల్లుడి కత్తిపోట్లకు దారితీసింది. హైదరాబాద్ శారదానగర్‌లో ఈ గొడవ చోటు చేసుకుంది.
శారదానగర్‌కు చెందిన మైఖేల్ అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుమార్తె, అల్లుడితో కలిసి నివాసం ఉంటన్నాడు. మంగళవారం మధ్యాహ్నం మైఖేల్ కూతురు మరియా థెరిస్సాతో కలిసి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే, వారిద్దరి నడుమ ఏ చానల్ చూడాలన్న విషయమై తగాదా వచ్చింది.

తండ్రీకూతుళ్ల మధ్య గొడవ పెద్దదవుతుండడంతో, అల్లుడు సత్యశ్రీనివాస్ కలుగజేసుకుని వారించబోయాడు. దీంతో ఆగ్రహించిన మైఖేల్ వంట గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో తన సొంత అల్లుడి మీద దాడి చేశాడు. ఈ సంఘటనలో సత్యశ్రీనివాస్ కు తీవ్రగాయాలయ్యాయి.
ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీటి మాయలో పడి మనిషి ఒక్కోసారి తనకున్న విచక్షణను, ఆలోచనను, వివేచనను కూడా కోల్పోతున్నాడు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications