టీవీ చానెళ్లకు పవన్ బాసట: ర్యాలీ ఉద్రిక్తం (పిక్చర్స్)

హైదరాబాద్: టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ న్యూస్ చానళ్ల నిలిపివేతపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద జర్నలిస్టులు సోమవారం చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్త నెలకొంది. జర్నలిస్టులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బహీర్‌బాగ్ నుంచి సచివాలయం వరకు జర్నలిస్టులు భారీ ర్యాలీ చేపట్టగా టూరిజం కార్యాలయం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జర్నలిస్టుల ర్యాలీకి వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.

కాంగ్రెసు నేత అద్దంకి దయాకర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆందోళనలకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ మద్దతు ప్రకటించారు.

అడ్డుకున్న పోలీసులు

అడ్డుకున్న పోలీసులు

టీవీ9, ఆంధ్రజ్యోతి న్యూస్ చానెళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

తీవ్ర ఉద్రిక్తత

తీవ్ర ఉద్రిక్తత

జర్నలిస్టుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో హైదరాబాదులోని బషీర్‌బాగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అద్దంకి దయాకర్ మద్దతు

అద్దంకి దయాకర్ మద్దతు

న్యూస్ చానెళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు చేపట్టిన ర్యాలీకి కాంగ్రెసు నాయకుడు అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు.

తలసాని శ్రీనివాస యాదవ్ సంఘీభావం

తలసాని శ్రీనివాస యాదవ్ సంఘీభావం

న్యూస్ చానెళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు చేపట్టిన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ సంఘీభావం తెలిపారు.

పోలీసు స్టేషన్‌కు తరలింపు

పోలీసు స్టేషన్‌కు తరలింపు

బషీర్‌బాగ్ వద్ద జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మీడియా గొంతు నొక్కొద్దు..

మీడియా గొంతు నొక్కొద్దు..

టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ న్యూస్ చానెళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ మీడియా గొంతు నొక్కొద్దని జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు.

జర్నలిస్టుల అరెస్టు

జర్నలిస్టుల అరెస్టు

టీవీ న్యూస్ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై ర్యాలీ చేపట్టిన జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసి, గాంధీ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కలాలకు సంకెళ్లు వద్దు

కలాలకు సంకెళ్లు వద్దు

మహిళా జర్నలిస్టులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. కలాలకు సంకెళ్లు వద్దని, మీడియా స్వేచ్ఛను హరించవద్దని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. వారికి పివోడబ్య్లు నేత సంధ్య మద్దతు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+