ట్వీట్‌వార్: పిచ్చికుక్కకు కూడా వైద్యం ఉంది, నారా లోకేశ్ గొర్రెల డాక్టర్ కామెంట్లపై వల్లభనేని వంశీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించడంతో మాటల యుద్ధం మొదలైంది. ఇందుకు వంశీ కూడా ధీటుగానే స్పందించారు. తన వద్ద పిచ్చి కుక్కలకు కూడా వైద్యం ఉందని చెప్పి.. ట్వీట్ వార్‌కు వంశీ మరింత హైప్ తీసుకొచ్చారు.

సంతలో గొర్రెలు..
ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఇటీవల మండలికి వచ్చిన సమయంలో కొందరు టీడీపీ సభ్యులు హాజరుకాకపోవడంతో వివాదం చెలరేగింది. చివరికి సభలో మండలి చైర్మన్ షరీఫ్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో పెద్దల సభ రద్దు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొన్నట్టు కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. దీంతో ట్వీట్‌వార్ పీక్ స్టేజీకి చేరింది.

గొర్రెల డాక్టర్...
సంతలో గొర్రెలతోపాటు గొర్రెల డాక్టర్‌ను కూడా జగన్ కొనుగోలు చేశారని నారా లోకేశ్ పోస్ట్ పెట్టారు. గొర్రెల డాక్టర్‌గా వల్లభనేని వంశీని చూపించారు. వంశీ-జగన్ కలిసి ఉన్న ఫోటోను కలిపి పోస్టులో పెట్టారు. దీనిపై వంశీ స్పందించారు. వద్దంటే మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మండలి కూడా రద్దు కానుండటంతో లోకేశ్‌కు ఏం అర్థం కావడం లేనట్టుంది. ఉన్న మండలి సీటు కూడా పోవడంతో ఆయనకు పిచ్చి పట్టినట్లుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పిచ్చి కుక్కకు వైద్యం..
తన వద్ద గొర్రెలకే కాదు పిచ్చికుక్కలకు కూడా వైద్యం ఉంది అని వంశీ చెప్పారు. లోకేశ్‌ను ఉద్దేశించి ఘాటు పోస్ట్ పెట్టారు. వంశీ వెటర్నరీ వైద్యుడు కావడంతో లోకేశ్ గొర్రెల డాక్టర్ అని సెటైర్ వేశాడు. దీనికి వంశీ కూడా అదే స్పీడుతో స్పందించాడు. కుక్కల వైద్యం కూడా ఉందని చెబుతూ.. లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.
-
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications