అగ్రి గోల్డ్ కేసులో మరో మలుపు: టేకోవర్‌కు వెనక్కి తగ్గిన జీ గ్రూప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఆ కంపెనీతో పాటు దాని అనుంబంధ సంస్థలన్నింటినీ టేకోవర్ చేస్తామంటూ గతంలో ముందుకు వచ్చిన జీ గ్రూప్ సంస్థ వెనక్కి తగ్గింది.

కేవలం అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని జీ గ్రూప్ సోమవారం నాడు హైకోర్టుకు తెలిపింది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరో మూడు నెలల గడువు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అగ్రిగోల్డ్ సంస్థలను తాము తీసుకుంటామని చెప్పిన జీ గ్రూప్ మూడు నెలలుగా ఫైళ్లన్నింటినీ పరిశీలించింది.

High Court

రూ. 10 కోట్లు డిపాజిట్ చేసింది కూడా. అయితే తాము ఆస్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని తాజాగా కోర్టుకు తెలిపింది. ఆస్తులను అప్పగిస్తే మరో కంపెనీ వచ్చి అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తే ఎలా అని జీ గ్రూప్ ప్రశ్నించింది.

ఆ సంస్థ ప్రతిపాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, బాధితులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
During the hearing in High Court, G Group has rejected totake over Agri Gold companies.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి