మెడికో ఆత్మహత్య కేసులో ట్విస్ట్: అంతుబట్టని విషయాలెన్నో..
అనంతపురం: మెడికో మీనాక్షి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. నిజానికి ఆమె అసలు పేరు మంజుల అని తెలుస్తోంది. ఆమె బెంగళూరులో మెడిసిన్ చదువుతున్నట్లు వార్తలు వచ్చాయి. మీనాక్షిది అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం బత్తలపల్లి అని తెలుస్తోంది.
వడ్డే రంగమ్మ, మారెన్న దంపతుల మూడో సంతానంగా మంజుల అలియాస్ మీనాక్షిగా చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రాము చౌదరి అనే వ్యక్తి మంజులను ప్రేమించి ఇంటి నుంచి తీసుకుని వెళ్లాడని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి మూడేళ్ల వరకు మంజుల ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియదు.

ఆ తర్వాత తాను బెంగళూరులో డాక్టర్ కోర్సు చదువుతున్నానని మంజుల తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. త్వరలో ఇంటికి వస్తానని కూడా చెప్పిందట. కానీ, అది జరగలేదు. అయితే, మంజులతో వెళ్లిపోయిన రాము చౌదరి శ్రీనివాస చౌదరికి బంధువు అని తెలుస్తోంది.
వారిద్దరితో పాటు మంజుల మూడేళ్లుగా అనంతపురంలో శ్రీనివాసనగర్‌లో ఉంటున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట శ్రీనివాస్ చదౌరికి మంజులతో వివాహమైంది. శ్రీనివాస చౌదరి వ్యవహారాలతో మంజుల విసిగిపోయినట్లు చెబుతున్నారు. దాంతో ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.
ఇదిలావుంటే, ఆరేళ్ల కిందట మంజులను తన వెంట తీసుకుని వెళ్లిన రామూ చౌదరి ఏమయ్యాడో తెలియడం లేదని వార్తలు వచ్చాయి. శ్రీనివాస్ చౌదరితో మంజుల వివాహం ఎలా అయిందనేది కూడా మిస్టరీగానే ఉందని చెబుతున్నారు.
సోమవారం రాత్రి పది గంటలకు మంజుల తన నాలుగు నెలల చిన్నారితో ఇంట్లో పడుకుంది. ఆ తర్వాత మంజుల ఉరికి వేలాడి చనిపోయింది. మంజుల మృతదేహాన్ని శ్రీనివాస్ మర్నాడు అర్థరారత్రి 2 గంటలకు కారులో సర్వజనాస్పత్రికి తీసుకుని వెళ్లాడు. ఆ విషయం వార్తాపత్రికల్లో వచ్చింది. దాంతో పోలీసులు శ్రీనివాస చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications