Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఖిలప్రియకు షాక్: నాకు అండగా ఉండు... సోదరుడి వద్దకు శిల్పా మోహన్ రెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో కలిశారు. ఉప ఎన్నికల్లో మద్దతు కోరారు.

అన్నదమ్ముల భేటీపై ఆసక్తి

అన్నదమ్ముల భేటీపై ఆసక్తి

శిల్పా సోదరులు ఇటీవలి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి, టిక్కెట్ దక్కించుకున్నారు. నంద్యాల నుంచి భూమా కుటుంబం నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల కలయికపై సర్వత్రా ఆసక్తి కనిపించింది.

Recommended Video

    YS Jagan Shock To Bhuma Akhila Priya
    చక్రపాణి మద్దతుపై అనుమానాలు?

    చక్రపాణి మద్దతుపై అనుమానాలు?

    టిక్కెట్ ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారు. శిల్పా చక్రపాణి టిడిపిలోనే కొనసాగుతున్నప్పటికీ ఆయన ఎవరికి మద్దతు పలుకుతారనే చర్చ అంతటా సాగుతోంది. వైసిపిలో ఉన్న సోదరుడు మోహన్ రెడ్డికా, లేక పార్టీలో ఉన్నప్పటికీ చిరకాల రాజకీయ ప్రత్యర్థి భూమా వర్గానికి మద్దతు పలుకుతారా అనే చర్చ సాగుతోంది.

    అఖిలప్రియ ఉద్దేశ్యపూర్కంగానే దూరం పెడుతోందా?

    అఖిలప్రియ ఉద్దేశ్యపూర్కంగానే దూరం పెడుతోందా?

    మంత్రి అఖిలప్రియ, భూమా కుటుంబం చక్రపాణి రెడ్డిని ఉద్దేశ్య పూర్వకంగానే దూరం పెడుతోందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే మంత్రులు కూడా మాట్లాడారు. చక్రపాణి రెడ్డి తానే ప్రచారానికి దూరం ఉంటున్నారని, తాను ఏం చేసినా విపక్షాలు ఇష్టారీతిగా ప్రచారం చేస్తాయనే దూరం పాటిస్తున్నానని తమకు చెప్పారని, ఆయన మద్దతు భూమా కుటుంబానికే అని చెప్పారు.

    లోపల జరుగుతోంది మరొకటి.. టిడిపిలో చేరుతారా?

    లోపల జరుగుతోంది మరొకటి.. టిడిపిలో చేరుతారా?

    కానీ లోపల జరుగుతున్న పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్ పదవి మిస్ అయింది. ఇప్పుడు అఖిల కూడా దూరం పెడుతుండటంతో ఆయన మరింత ఆవేదనగా ఉన్నారని చెబుతున్నారు. సోదరుడు మోహన్ రెడ్డి దారిలోనే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసిపిలో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆగస్ట్ 3న జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా సోదరుల భేటీపై చర్చనీయాంశమైంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+