దర్జాగా దొంగిలించిన బైక్‌పై తిరుగుతున్నారు(పిక్చర్స్)
విశాఖపట్నం: తాళం వేసి ఉన్న ఇళ్లలోకి రాత్రి వేళ చొరబడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మూడో పట్టణ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ ఎడీసీపీ ఎస్.వరదరాజులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విజయనగరంలోని స్టేడియంపేటకు చెందిన గొర్లే పైడిరాజు (23), మధురవాడ మారికవలసకు చెందిన నేదురి వీర్రాజు (46) పాత నేరస్తులు. వీరిద్దిరిపైనా పోలీసులు రౌడీ షీట్లు తెరిచారు. ఇళ్ల చోరీలకు పాల్పడిన ఇద్దరూ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది.
జైలు నుంచి విడుదలైన తర్వాత నగరానికి వచ్చారు. వాల్తేరు డిపో వద్ద రెండు బైకులను దొంగిలించి వాటిపై నగరంలో తిరుగుతూ ఈస్ట్ పాయింట్ కాలనీ, రామ్ నగర్ బజార్, పీతలవానిపాలెం, సుభాష్ నగర్, వెలంపేట, ఆనందపురంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో మూడవ పట్టణ పోలీసులు పెద్ద వాల్తైరు డిపో వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు విప్పారు. నిందితుల నుంచి 126 గ్రాముల బంగారం, సుమారు నాలుగు కిలోల వెండి, లక్ష రూపాయలు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దర్జాగా దొంగిలించిన బైక్‌పై తిరుగుతున్నారు
నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న 126 గ్రాముల బంగారం, సుమారు నాలుగు కిలోల వెండి, లక్ష రూపాయలను ప్రదర్శనకు ఉంచిన దృశ్యం.

విజయనగరంలోని స్టేడియంపేటకు చెందిన గొర్లే పైడిరాజు (23), మధురవాడ మారికవలసకు చెందిన నేదురి వీర్రాజు (46) పాత నేరస్తులంటూ వివరాలు వెల్లడిస్తున్న క్రైమ్ ఎడీసీపీ ఎస్.వరదరాజులు.

దర్జాగా దొంగిలించిన బైక్‌పై తిరుగుతున్నారు
ఈ క్రమంలో మూడవ పట్టణ పోలీసులు పెద్ద వాల్తైరు డిపో వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టు విప్పారు. నిందితుల నుంచి 126 గ్రాముల బంగారం, సుమారు నాలుగు కిలోల వెండి, లక్ష రూపాయలు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Click it and Unblock the Notifications