ఫేస్‌బుక్‌లో చూసి బైక్ దొంగిలించిన బీటెక్ విద్యార్థులు

కరీంనగర్‌లోని ప్రియదర్శిని కాలనీలో నివాసముంటున్న అరుణ్ (22) అక్కడే బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి అన్ననరేష్ హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా అన్న నరేష్‌ను కలిసేందుకు ఇటీవల అరుణ్ నగరానికి వచ్చాడు. బాగ్‌లింగంపల్లిలో నివాసముండే అతని చిన్ననాటి స్నేహితుడు హేమంత్ (23)ను సోమవారం ఉదయం కలిశాడు.
అరుణ్, హేమంత్ ఇద్దరూ కలిసి లంగర్ హౌస్ కు వచ్చి నరేష్‌ను కలిశారు. ఆ తర్వాత బాగ్‌లింగంపల్లికి తిరిగి వెళ్తూ పెన్షన్‌పురా మార్గంలో ఉన్న ఓ సెల్ ఫోన్ దుకాణం వద్ద ఆగారు. అక్కడే పార్క్ చేసివున్న పల్సర్ బైక్‌ను అరుణ్, హేమంత్ లు దొంగిలించారు. దీంతో వాహనదారుడు మహ్మద్ అహ్మద్ లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా మహ్మద్ బైక్‌పై అరుణ్, హేమంత్‌లు వెళుతుండగా మహ్మద్ స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దొంగతనంపై విచారణ జరుపుగా తాము ఫేస్‌బుక్‌లో ఫుటేజీని చూసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు అరుణ్, హేమంత్‌లు తెలిపారు.












Click it and Unblock the Notifications