వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర ఉద్యమం తప్పని తేలింది, వెంకయ్య వల్లే: మాణిక్యాలరావు సంచలనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందన్నది అక్షరసత్యమని ఇప్పుడు నిరూపితమైందని బీజేపీ సభ్యులు పైడికొండల మాణిక్య రావు గురువారం అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన శాసన సభలో మాట్లాడారు.

ఓపికపడుతున్నా, మీరే అన్నారుగా.. ఇప్పుడేం చేశావ్: మోడీకి బాబు డెడ్‌లైన్, విష్ణు కౌంటర్ఓపికపడుతున్నా, మీరే అన్నారుగా.. ఇప్పుడేం చేశావ్: మోడీకి బాబు డెడ్‌లైన్, విష్ణు కౌంటర్

పుష్కరాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. దేవాదాయ శాఖలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. తనకు మంత్రి పదవి రావడానికి వెంకయ్య నాయుడు కారణమని చెప్పారు.

వెంకయ్యను దోషిగా చూస్తున్నారు

వెంకయ్యను దోషిగా చూస్తున్నారు

తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నప్పటికీ నియోజకవర్గ అబివృద్ధికి కట్టుబడి ఉన్నానని మాణిక్యాల రావు చెప్పారు. ఏపీకి కేంద్రం సాయం చేసినా అర్థం చేసుకోవడం లేదన్నారు. రాజ్యసభలో ఏపీ కోసం పోరాడిన వెంకయ్యను దోషిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమకారులది తప్పని తేలింది

సమైక్యాంధ్ర ఉద్యమకారులది తప్పని తేలింది

ఆంధ్రప్రదేశ్‌కు మొదటి నుంచి అండగా ఉంటున్న బీజేపీని దోషిగా చూస్తున్నారని మాణిక్యాల రావు అన్నారు. ఏపీ పట్ల మోడీ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన వాళ్లది తప్పని ఇప్పుడు నిరూపణ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రా ఉద్యమం

ఆంధ్రా ఉద్యమం

విభజన తర్వాత రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నామని మాణిక్యాల రావు చెప్పారు. ప్రత్యేక ఆంధ్రా ఉద్యమం వల్లే ఇప్పుడు సాధించిన అభివృద్ధి అన్నారు. విడిపోవడం వల్ల ఏపీ అభివృద్ధి చెందుతోందన్నది అక్షర సత్యమని చెప్పారు.

 ఏపీకి బీజేపీ శత్రువు కాదు, మిత్రువు, చేతులెత్తి మొక్కుతున్నా

ఏపీకి బీజేపీ శత్రువు కాదు, మిత్రువు, చేతులెత్తి మొక్కుతున్నా

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని మాణిక్యాల రావు చెప్పారు. ఏపీకి బీజేపీ శత్రువు కాదని, మిత్రువు అన్నారు. మిత్రుడు కామినేనికి తనకు మాటల్లో తేడా ఉంటుందని, తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్నానని చెప్పారు.

వ్యతిరేకత వస్తుందని తెలిసినా

వ్యతిరేకత వస్తుందని తెలిసినా

నాడు తెలంగాణ నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు చెప్పడంతో.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్న నరేంద్ర మోడీ ఏడు మండలాలను ఏపీలో కలిపారని మాణిక్యాల రావు చెప్పారు. తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని, నవ్యాంధ్రకు చాలా సాయం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు.

English summary
Kamineni Srinivas, Health and Medical Education minister, and P Manikyala Rao, Endowments Minister, submitted their resignations to the Chief Minister today. Their decision is in the wake of TDP asking its ministers to resign from the Union Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X