కర్నూలు జిల్లాలో మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి !
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ తరుణంలోనే కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
దైవ దర్శనానికి వెళ్తుండగా..
కాగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపు తప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కర్ణాటక నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం కోసం మంత్రాలయం వెళ్తుండగా ఈ విషాదం జరిగినట్టు వాపోతున్నారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారంతా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామానికి చెందిన వారుగా వెల్లడించారు. వెంకటేశప్ప(60), ఆయన కూతురు మీనాక్షి(32), అల్లుడు సతీశ్(36), మనవళ్లు రుత్విక్, బన్నీగౌడ్‌లుగా తేల్చారు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవలే కర్నూలు జిల్లాలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమై ఏకంగా 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైంది. మోటార్ సైకిల్ ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం మరువక ముందే ఇప్పుడు అదే కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా విషాదం నింపుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications