హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్: కొకైన్ స్వాధీనం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను సాగిస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టరట్టయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన మైక్ జస్టస్(34), ఓలిశా జోయ్(32) అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నైజీరియాకు చెందిన వీరిద్దరూ టూరిస్ట్ వీసా మీద నగరానికి వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత బిజినెస్ వీసా తీసుకున్నారని తెలిపారు. వీరు ఇక్కడి నుంచి దుస్తులను వారి దేశానికి ఎగుమతి చేస్తున్నాడు. కాగా, మైక్ జస్టస్ ముంబై ఉండి ఇదే వ్యాపారాన్ని నిర్వహించాడు. ఇతడు సెప్టెంబర్ 2012లో మనదేశానికి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయి.. మళ్లీ సెప్టెంబర్ 2013లో ముంబైకి వచ్చాడని చెప్పారు.

దుస్తుల ఎగుమతి పేరుతో వీరిద్దరూ డ్రగ్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితమే మస్టస్ వీసా గడువు ముగిసిందని పోలీసులు తెలిపారు. ఓలిశా జోయ్ కూడా దుస్తుల వ్యాపారం పేరుతో ముంబైకి వచ్చాడు. వీరిద్దరికీ పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ముంబైతోపాటు వీరు హైదరాబాద్‌లోని ఉన్నతవర్గాలకు చెందిన వారికి కొకైన్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు.

ఇక్కడ కూడా కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో రూ. 47,600 విలువైన 17 గ్రాముల కొకైన్ తీసుకొచ్చాడు. తమకందిన సమాచారంతో దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కోటి రెడ్డి, ఏపి ఆనంద్ కుమార్, సూర్యా నాయక్, జి. నరేష్, ముత్య యాదవ్ పర్యవేక్షణలో ఈ అరెస్ట్ జరిగింది.

నైజీరియన్ల అరెస్ట్

నైజీరియన్ల అరెస్ట్

విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను సాగిస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టరట్టయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నైజీరియన్ల అరెస్ట్

నైజీరియన్ల అరెస్ట్

నిందితుల వద్ద నుంచి 17 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నైజీరియన్ల అరెస్ట్

నైజీరియన్ల అరెస్ట్

నిందితులైన మైక్ జస్టస్(34), ఓలిశా జోయ్(32) అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నైజీరియాకు చెందిన వీరిద్దరూ టూరిస్ట్ వీసా మీద నగరానికి వచ్చారని పోలీసులు వెల్లడించారు.

నైజీరియన్ల అరెస్ట్

నైజీరియన్ల అరెస్ట్

ఆ తర్వాత బిజినెస్ వీసా తీసుకున్నారని తెలిపారు. వీరు ఇక్కడి నుంచి దుస్తులను వారి దేశానికి ఎగుమతి చేస్తున్నాడు.

నైజీరియన్ల అరెస్ట్

నైజీరియన్ల అరెస్ట్

మైక్ జస్టస్ ముంబై ఉండి ఇదే వ్యాపారాన్ని నిర్వహించాడు. ఇతడు సెప్టెంబర్ 2012లో మనదేశానికి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయి.. మళ్లీ సెప్టెంబర్ 2013లో ముంబైకి వచ్చాడని చెప్పారు.

English summary
Two cocaine drug peddlers held in Hyderabad by Police. They seized 17 grams of cocaine and three cell phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X