మితి మీరిన వేగానికి ఇద్దరు యువకులు బలి
గుంటూరు జిల్లా అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు లో జరిగిన బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.ప్రమాదం జరిగి గంట కావస్తున్నా మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు లో జరిగిన బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదం జరిగి గంట కావస్తున్నా మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
అచ్ఛంపేట నుండి సత్తెనపల్లి వెళ్లే మార్గంలో ఇద్దరు యువకులు రోడ్డుపై మితిమీరిన వేగంతో వచ్చారు. అచ్ఛంపేటకు కిలోమీటర్ దూరంలో మలుపు తిరగబోయి అక్కడ ఉన్న ఇండి కేటర్ ని ఢీకొని తీవ్రగాయాలతో ప్రమాద ఘటన ప్రాంతంలోనే మృతి చెందారు.

యువకులిద్దరికి 20 సంవత్సరాలు పైనే ఉంటాయి. ప్రమాద ప్రాంతానికి పోలీసులు చేరుకొని వివరాలు రాబట్టే ప్రయత్నం లో ఉన్నారు.












Click it and Unblock the Notifications