విజయవాడలో అగ్నిప్రమాదం- ఇద్దరు మృతి..!!
దీపావళికి నగరం సిద్దం అవుతున్న వేళ విజయవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు సజీవ దహనమయ్యారు. విజయవాడ జింఖానా మైదానంలో బాణసంచా విక్రయాలు కొనసాగుతున్నాయి. అక్కడ స్టాల్స్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. మంటల విషయం తెలసుకున్న సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఈ సమయంలో ఇద్దరు మరణించారు. మూడు షాపులు పూర్తిగా కాలిపోయాయి.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీపావాళి సామాన్లు పెద్ద మొత్తంలో నిల్వి చేయటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 19 షాపులకు అనుమతి ఇచ్చారు. 15, 16, 17 షాపుల్లో చెలరేగిన మంటలు చెలరేగాయి. మృత్తులు 15వ షాపుకు చెందినవారీగా భావిస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యాపారికి గుండె పోటు రావటంతో ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీపావళి విక్రయించే దుకాణ దారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడ నగరం మధ్యలో ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగటంతో అందరూ అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications