రెండు గ్యాంగ్ రేప్‌లు: వరుసకు అన్న, బాబాయ్
నెల్లూరు/ గుంటూరు: బంధుత్వాలను, వావి వరుసలను విస్మరించి ఇద్దరు యువకులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో ఈ నెల 12 వతేదీన సాయంత్రం జరిగింది.
ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన మామిడితోటలో జరిగిన ఈ అత్యాచార ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.
మామిడితోటకు కాపలాగా ఉన్న వాసూరి శేఖర్ అనే యువకుడు తోటలో వంకాయలున్నాయని, వాటిని కోసుకొని వెళ్లమని బాలికను పిలిచాడు. వంకాయలు కోసుకునేందుకు వచ్చిన బాలికను తోటలో ఉన్న శేఖర్, ప్రసాది శివలు గదిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికకు దగ్గరి బంధువైన శేఖర్ వరుసకు బాబాయ్ అవుతాడని గ్రామస్థులు చెప్పారు. మరో యువకుడైన ప్రసాది శివ వరుసకు అన్నయ్య అవుతాడని పోలీసులు చెప్పారు.
బాధిత బాలికను గూడూరులోని ఆసుపత్రికి పంపించి, నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వేస్టేషనులో గుర్తు తెలియని యువతిపై కొందరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications