ఇద్దరు అమ్మాయిల అదృశ్యం ... ఓ వ్యక్తి ఆత్మహాత్య

ప్రకాశం :ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ బాలికల అదృశ్యానికి తనకు సంబందం లేదనే నిరూపించుకోలేక ఆయన పురుగులమందు తాగి ఆత్మహాత్యకు పాల్పడ్డారు.

ప్రకాశం జిల్లా కుందంపల్లికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ ఘటన అక్టోబర్ 12వ,తేదిన జరిగింది. ఈ ఘటన జరిగిన నాటి నుండి గ్రామంలో కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు.ఇద్దరు బాలికల అదృశ్యానికి అదే గ్రామానికి చెందిన రాజయ్య కుమారుడే కారణమని పంచాయితీలో నిందించారు.

two girls dissapper..man suicide

బాలికల అదృశ్యం విషయమై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కుల పంచాయితీ లో నిందను మోపడంతో ఆ నింద నుండి తప్పించుకొనేందుకుగాను ఏం చేయాలో రాజయ్యకు అర్థం కాలేదు. మహాబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న మంత్రగత్తె వద్దకు వెళ్తే మంత్రగత్తె రాజయ్య చేయి పట్టుకొంది.దీంతో రాజయ్యను బాలికల బందువలు వేదించారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ ఇంటిపైకి వచ్చారు.

అమ్మాయిల బందువుల ఒత్తిడి ఎక్కువ కావడంతో రాజయ్య నవంబర్ 1వ, తేదిన పురుగుల మందు తాగి ఆత్మహాత్యయత్నం చేశాడు. ఎర్రగొండపాలెం పభుత్వ ఆసుపత్రిలో చికత్స పొందుతూ గురువారం నాడు ఆయన మరణించాడు. రాజయ్య కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+