భవిష్యత్తులో జగన్‌కు తలనొప్పిగా మారనున్న ఆ ఇద్దరు నేతలు??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఇద్దరు నేతలు భవిష్యత్తులో తీవ్రమైన తలనొప్పులు తెచ్చేవారుగా తయారుకానున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులను ఎంపిక చేశారు. వారిలో విజయసాయిరెడ్డి, జగన్ కేసులు వాదించే లాయర్ నిరంజన్‌రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బీద మస్తాన్‌రావు, తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఉన్నారు.

ఇద్దరు నేతల వ్యవహారం కాస్తంత అనుమానాస్పదమే?
రాజ్యసభకు కొత్తగా ఎంపికైన ఈ నలుగురిలో ఇద్దరి నేతల వ్యవహారం కాస్త అనుమానించదగిన విధంగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి. 2024లో జగన్మోహన్‌రెడ్డి ఒకవేళ అధికారంలోకి రాలేకపోతే బీసీ నేతగా ఎంపిక చేసిన బీద మస్తాన్‌రావు పార్టీకి దూరం జరుగుతారని, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారని భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నేతగా ఉన్న మస్తాన్‌రావు ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలను కలిగివున్నారు. అలాగే ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీలో ముఖ్యభూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
మరో వ్యక్తి ఆర్.కృష్ణయ్య. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల తరుపుముక్కగా ఉపయోగడతారని జగన్ భావించి ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారని, ఆయన ఎంపికైన రోజే కృష్ణయ్యపై తెలంగాణలో భూ కబ్జా కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదైందని ఆయన ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. మొదట తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చిన కృష్ణయ్య ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.
భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటారో చెప్పలేమని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. ఏపీలో బీసీలను ప్రభావితం చేసి జగన్‌కు ఓటేయించగలస్థితిలో కృష్ణయ్య లేరని భావిస్తున్నారు. ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు కేంద్రం ఎటువంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా తెలంగాణకు అనుకూలంగా సభలో మాట్లాడే అవకాశం కనపడుతోంది. కాబట్టి భవిష్యత్తులో ఈయనతోను తలనొప్పేనని భావిస్తున్నారు.

కేసీఆర్ కూడా ఇబ్బందులు పడ్డారు
మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ నుంచి డీ శ్రీనివాస్‌ను తీసుకొని రాజ్యసభకు పంపిస్తే చివరకు ఆయనే పార్టీకి తలనొప్పిగా తయారైన విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయలేక, ఎటువంటి చర్యలు తీసుకోలేక కేసీఆర్ మల్లగుల్లాలు పడ్డారంటూ కేసీఆర్ ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసే వ్యక్తులు నమ్మదగినవారుగా ఉండాలని, పార్టీ పట్ల నిబద్దత, విధేయత కలిగినవారు ఉండాలని, అటువంటి వ్యక్తులను ఎంపికచేస్తే చివరివరకు పార్టీని అంటిపెట్టుకొని ఉంటారనేది సీనియర్ రాజకీయవేత్తల భావన.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications