పెళ్లి: రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం

కాగా, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో కలిసి చనిపోవాలని నలుగురూ నిర్ణయించుకున్నారు. బాపట్ల శివారులోకి వెళ్లి నలుగురూ పురుగుల మందు తాగారు. వారిని గమనించిన స్థానికులు, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు.
వెంటనే వచ్చిన వాహనం వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రత్యూష, దుర్గ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పాతగుంటూరు ఆంజనేయస్వామి గుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆంజనేయస్వామి గుడి సెంటర్‌లోని ఆర్ఎంపి ఆవుల గోపీనాయుడు కుమార్తె ఆదిలక్ష్మీకి, రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన గుడి ఆనందప్రకాష్‌కు 2003లో వివాహమైంది. ఆనందప్రకాష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరికి వరణ్యగాంధీ, భువన శృతి సంతానం.
కాగా, కొద్ది నెలల కిందట ఆమెరికా వెళ్లారు. అక్కడ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆదిలక్ష్మీని తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని ప్రవర్తనకు తల్లిదండ్రులు వత్తాసు పలుకుతున్నారు. ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో కొద్ది రోజుల కిందట ఆదిలక్ష్మీ పాతగుంటూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మంగళవారం భార్యాభర్తలిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భర్త సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైన ఆదిలక్ష్మీ మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications