లోకేష్‌కు బంపర్ ఆఫర్: 2019లో త్యాగానికి సిద్దమన్న ఇద్దరు మంత్రులెవరు?

అమరావతి: 2019 ఎన్నికల్లో లోకేష్‌ పోటీ చేసేందుకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న సీట్లను త్యాగం చేస్తామని ఇద్దరు మంత్రులు ముందుకు వచ్చారు.తమ ప్రాంతం నుండి లోకేష్ పోటీ చేయాలని వారు కోరుతున్నారు. లోకేష్ పోటీకి సిద్దపడితే తాము మరో చోట పోటీ చేసేందుకు వెనుకాడబోమని చెబుతున్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు రాయలసీమ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నందున, ఉత్తరాంద్ర నుండి లోకేష్ ప్రాతినిథ్యం వహించాలని మరో మంత్రి కోరుతున్నారు.

2019 ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఏపీ మంత్రి లోకేష్‌కు ఇద్దరు మంత్రులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా లోకేష్ ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో లోకేష్‌కు మంత్రి పదవి దక్కింది.

వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే లోకేష్ పోటీ చేసేందుకు సురక్షితమైన నియోజకవర్గాన్ని ఆ పార్టీ నాయకత్వం ఎంపిక చేయనుంది. అయితే అదే సమయంలో ఇద్దరు మంత్రులు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు స్థానాల నుండి పోటీ చేయాలని లోకేష్ ను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన టిడిపి ప్రజా ప్రతినిధుల వర్క్‌షాప్‌ సందర్భంగా మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేష్‌కు ఇద్దరు మంత్రుల ఆఫర్

లోకేష్‌కు ఇద్దరు మంత్రుల ఆఫర్

ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు మంత్రులు అమర్‌నాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు బంపర్ ఆఫర్ ఇచ్చారు 2019 ఎన్నికల్లో లోకేష్ కోరుకొంటే తాము ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల నుండి పోటీ చేయాలని కోరారు. లోకేష్ పోటీకి సిద్దమైతే తాము వేరో చోటు నుండి పోటీకి రెడీ అవుతామని వారు ప్రకటించారు. వీరిద్దరూ కూడ ఈ మేరకు లోకేష్ ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. రాయలసమీ నుండి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఉత్తరాంధ్ర నుండి లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తే బాగుంటుందని మరో మంత్రి సూచించారు.

Recommended Video

    Chandrabau naidu On cabinet ministers : నారా లోకేశ్‌ ముందంజలో, చంద్రబాబు వ్యంగ్యం
    పుంగనూరుకు మారుతానన్న అమర్‌నాథ్ రెడ్డి

    పుంగనూరుకు మారుతానన్న అమర్‌నాథ్ రెడ్డి

    2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తానంటే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పలమనేరు సీటును త్యాగం చేస్తానని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. తాను పుంగనూరుకు మారుతానని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి వచ్చాయని అమర్ నాథ్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కారణంగానే పలమనేరు నుండి పోటీ చేయాలని లోకేష్ ను అమర్ నాథ్ రెడ్డి కోరారు. లోకేష్ పలమనేరు నుండి పోటీ చేస్తే తాను పుంగనూరుకు మారుతానని అమర్ నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

     భీమిలి నుండి పోటీ చేయాలన్న గంటా

    భీమిలి నుండి పోటీ చేయాలన్న గంటా

    2019 ఎన్నికల్లో లోకేష్ భీమిలి నుండి పోటీచేస్తే తాను తన సీటును త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. చంద్రబాబునాయుడు రాయలసీమ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నందున , లోకేష్ ఉత్తరాంధ్ర నుండి ప్రాతినిథ్యం వహించాలని గంటా శ్రీనివాసరావు కోరారు.

     లోకేష్ మనసులో ఏముందో

    లోకేష్ మనసులో ఏముందో

    మంత్రి లోకేష్ మనసులో ఏముందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ పదవుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ గత ఏడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అయితే మంత్రివర్గంలోకి వచ్చేందుకుగాను లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు 2019 ఎన్నికల్లో లోకేష్ మాత్రం అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో లోకేష్ మాత్రం ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఈ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+