వెంకయ్యను ఏకేసిన జైరాం, బీజేపీని వ్యతిరేకించాలని టీడీపీకి

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ నాయుడు పోలవరం పేరుతో ప్రజలను మోసం చేస్తుంటే, మరో నాయుడు ప్రత్యేక హోదాతో మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు కావాలని అన్ని పార్టీలు కోరాయని చెప్పారు. ఇప్పుడు వెంకయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. విభజన చట్టంలోని వాటికే చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ఎన్డీసీ ఆమోదం లేకుండానే నాడు వాజపేయి ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారని, దీనిని వెంకయ్య గుర్తు పెట్టుకోవాలన్నారు.

Two naidus cheating AP people: Jairam

విభజన తర్వాత హోదా పైన ప్లానింగ్ కమిషన్‌కు ప్రధాని ప్రకటనను పంపించామని చెప్పారు. గతంలో భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన భూసేకరణ బిల్లునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ బిల్లును టీడీపీ, తెరాసలు కూడా వ్యతిరేకించాలన్నారు. ఆ బిల్లును ఎన్నిసార్లు పెట్టినా తాము వ్యతిరేకిస్తామన్నారు.

రాయలసీమకు జగన్‌ అన్యాయం చేస్తున్నారు: దేవినేని

రాయలసీమకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. శుక్రవారం తెలుగుగంగ ప్రాజెక్టును మంత్రి పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పట్టిసీమపై జగన్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+