మంగళగిరిలో విషాదం:ఈతకు వెళ్లి ఇద్దరు ఫార్మసీ విద్యార్థులు మృతి

Subscribe to Oneindia Telugu

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక నిర్మలా ఫార్మసి కళాశాలలో మూడవ సంవత్సరం ఫార్మసి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కు వెళ్లి మృతి చెందారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు కి చెందిన పగడాల సుధీర్(20) మంగళగిరి రత్నాల చెరువు కు చెందిన గరిక ముక్కు జీసస్(21) మంగళగిరి మండలం కృష్ణాయపాలెం కు చెందిన కొడాలి చందు ముగ్గురు స్నేహితులు. ఈ రోజు మధ్యాహ్నం తరువాత వీరు స్థానిక గుంటూరు ఛానల్ లో ఈతకు వెళ్లారు. ముగ్గురిలో సుధీర్,జీసస్ లు ఇద్దరు ఈతకు దిగారు.

Two pharmacy students died in Atmakur

చందు మాత్రం నీటిలో దిగక పోవటం వలన సేఫ్ గా ఉన్నాడు. కాలేజి లో ఎంక్వయిరీ చేస్తే ముగ్గురు విద్యార్థులు ఈ రోజు కళాశాలకు రాలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇద్దరు నీటిలో మునిగి బయటకు రాని కారణంగా చందు స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈత గాళ్ల సాయం తో గల్లంతు అయిన విద్యార్థులను గాలించారు.

Two pharmacy students died in Atmakur

ఇందులో ఛానల్ ఉదృతం గా ప్రవహిస్తుండగా, గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థుల మృతదేహాలను మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two pharmacy students allegedly fell into a canal and died in Atmakur, in Guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి