జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఉభయగోదావరి జిల్లాల సీనియర్ నేతలు

ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్ పాండ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసిన జగన్.. ఆయనను సాదారంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కరసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు.

Two senior leaders joined in YSRCP

ఇది ఇలా ఉండగా, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+