వేధింపులు: ఉరివేసుకుని తోడికోడళ్ల ఆత్మహత్య
కృష్ణా: జిల్లాలోని గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తోడికోడళ్లు ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపుల కారణంగా వారు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజనం వికటించి 15మందికి అస్వస్థత
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలోని గురుకుల జూనియర్ కళాశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటగిరిలోని ఓ ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.

ట్రాక్టర్ ఢీకొని స్టేషన్ మాస్టర్ మృతి
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ స్టేషన్ మాస్టర్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన బుధవారం జరిగింది. విధులకు హాజరయ్యేందుకు స్టేషన్ మాస్టర్ మునిస్వామి వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొంది.
ఫ్యాక్షనిస్ట్ హుస్సేన్ లొంగుబాటు
అనంతపురం: పలు కేసుల్లో నిందితుడైన ఫ్యాక్షనిస్ట్ నాగూర్ హుస్సేన్ బుధవారం ఉదయం ధర్మవరం కోర్టులో లొంగిపోయాడు. గత పదేళ్లుగా అతను అజ్ఞాతవాసంలో ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications