నేటితో రెండేళ్లు.. ఆ ఒక్క పని జగన్ కొంపముంచిందా !

2023 సెప్టెంబర్ 9.. రెండేళ్ల క్రితం ఇదే రోజు రాష్ట్ర రాజకీయాలను వణికించిన ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ రోజు టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి.. రాజకీయాల్లో మహామహులను సైతం మట్టికరిపిస్తూ.. తెలుగు దేశం పార్టీని నడిపిస్తున్న వ్యక్తి. అది కూడా ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దాఖలాలు లేని మనిషిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ అధికారులు ఆయనను నంద్యాలలో అదుపులోకి తీసుకుని.. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు తరలించారు. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిర్బంధించారు. ఆ అరెస్టు వ్యవహారం రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.

two-years-for-chandrababu-arrest-in-skill-development-case

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు..

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో కలిసి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రారంభించింది. సుమారు నాలుగు లక్షల మందికి శిక్షణ ఇచ్చి.. వేలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. అయితే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ సీఐడీతో విచారణ జరిపించింది. ఈ విచారణలో భాగంగానే చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు మోపి అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

అరెస్టు సమయంలో..

2023 సెప్టెంబర్ 8న నంద్యాలలో జరిగిన 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ' సభ తర్వాత చంద్రబాబు తన బస్సులో విశ్రాంతి తీసుకుంటుండగా.. అర్ధరాత్రి సీఐడీ పోలీసులు హఠాత్తుగా మోహరించారు. తెల్లవారుజామున 6 గంటలకు డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయన్ను అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను విశ్రాంతి తీసుకోనీయకుండా వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు జైలులోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వేధింపులు కొనసాగించారని కూడా టీడీపీ ఆరోపించింది.

53 రోజుల నిర్బంధం..

చంద్రబాబు 53 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2023 అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు బయల్దేరినప్పుడు దారిపొడవునా వేలాదిమంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణానికి 14 గంటలు పట్టింది.

ఇక ఆ సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయనను పరామర్శించేందుకు రావడాన్ని నిరాకరించారు. ఆ సమయంలోనే ఆయన నదిరోడ్డుపై పడుకోవడం జనసైనికులు ఆయనకు తోడుగా భారీ ర్యాలీతో రావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీతో ఎన్నికల్లో పొత్తు చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో చేరడంతో మూడు పార్టీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చాయి.

ఈ క్రమంలోనే 2019లో 151 సీట్లు గెలిచిన వైఎస్సార్‌సీపీ.. గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి 21 స్థానాలు గెలవగా, వైసీపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అయితే జగన్ అంతటి ఘోర పరాభవం ఎదుర్కొనడానికి ప్రధాన కారణం అంటే చంద్రబాబు అరెస్ట్ అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ ఒక్క నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభివర్ణిస్తారు. ఇక ఇప్పుడు నటి అరెస్ట్ వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+