విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొద్దిలో చేజారిన 'తెలుగు': చంద్రబాబు-అమీర్ ఖాన్ హల్‌చల్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: సొంతగడ్డ పైన బోణీ కొట్టాలనుకున్న తెలుగు టైటాన్స్‌కు ఆదివారం నాడు నిరాశ కలిగించింది. శనివారం విశాఖలో ఆరంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ మూడో సీజన్‌ తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ 25-27తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యు ముంబా చేతిలో ఓడింది.

టైటాన్స్‌ రైడర్లు సుఖేశ్‌ హెగ్డే (9), రాహుల్‌ చౌదరి (6) చివర్లో రెచ్చిపోయి ఆడారు. మ్యాచ్ ఆరంభం పాయింట్ల పట్టిక నెమ్మదిగా కనిపించింది. పది నిమిషాల అనంతరం రెండు జట్లు సమానంగా అయిదు పాయింట్లతో ఉన్నాయి. ఆ తర్వాత నుంచి యు ముంబా రెచ్చిపోయింది.

ఓ సమయంలో తెలుగు టైటాన్స్ 8 పాయింట్ల వద్ద ఉండగా, యు ముంబా 20 పాయింట్లకు చేరువైంది. అయితే, చివరలో తెలుగు టైటాన్స్ రెచ్చిపోయి ఆడారు. దీంతో 25-27 తోడాతో రెండు పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ పోరాడి ఓడింది.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొడగొట్టారు. ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్టణంలో ప్రోకబడ్డీ లీగ్ ప్రారంభించిన చంద్రబాబునాయుడు ఆ సందర్భంగా బాల్యాన్ని గుర్తు చేసుకుని తొడగొట్టారు.

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

తెలుగు టైటాన్స్, యు ముంబయ్ క్రీడాకారులను ఉత్సాహపరచడంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొడగొట్టారు.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యమన్నారు. ఆ ఒలింపిక్స్‌లో కబడ్డీ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్ మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ అభిమానులను అలరించాడు. సంప్రదాయక పంచెకట్టు, నెహ్రు జాకెట్ వస్త్రధారణతో ఆమిర్ జాతీయ గీతాలాపన ప్రేక్షకులను కట్టిపడేసింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

యు ముంబా కెప్టెన్ అనూప్ కుమార్(5 పాయింట్లు), రిశాంక్ దేవదిగా(7పాయింట్లు) రైడింగ్‌లో మెరవడంతో మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సరికి ముంబై 13-8 ఆధిక్యంలో నిలిచింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఇలా ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో పాయింట్ల మధ్య అంతరం తగ్గుతూ చివరికి మ్యాచ్ ముంబై వశమైంది. మరో మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ బెంగళూరు బుల్స్ 35-29తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

తెలుగు టైటాన్స్‌ రైడర్లు సుకేశ్‌ హెగ్డే (9), రాహుల్‌ చౌదరి (6) చివర్లో చెలరేగారు. మ్యాచ్‌ ఆరంభంలో రెండు జట్ల డిఫెన్స్‌ పటిష్టంగా ఉండటంతో రైడర్లు పాయింట్లు తెచ్చేందుకు కష్టపడ్డారు.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

12వ నిమిషానికి రెండు జట్లు 5-5తో సమానంగా ఉన్నాయి. ఇక్కడే ముంబా ముందడుగేసింది. వరుసగా రెండు రైడ్లలో అనూప్‌ (6 పాయింట్లు) సఫలమై మూడు పాయింట్లు తేవడంతో 8-5తో ఆధిక్యంలోకి వెళ్లింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ను కూడా పట్టేసింది. ఇక అర్ధభాగానికి ముందు చివరి రైడ్‌లో ముంబా ఆటగాడు రిషాంక్‌ దేవడిగ (7) అదరగొట్టాడు.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

సూపర్ రైడ్‌తో టైటాన్స్‌ను ఆలౌట్‌ చేశాడు. ఫలితంగా ముంబా 18-8తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషం వరకూ అదే వూపును కొనసాగిస్తూ 26-14తో నిలిచింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఆటలో మిగిలింది మరో నాలుగు నిమిషాలు. పాయింట్లలో తేడా 12. టైటాన్స్‌కు ఓటమి దాదాపు ఖాయమే. ఐతే చివరి నిమిషాల్లో పోరాటానికి పెట్టింది పేరైన తెలుగు జట్టు చెలరేగింది.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

సుకేశ్‌ రెండు సార్లు.. రాహుల్‌ ఓసారి ఒకే రైడ్‌లో రెండేసి పాయింట్లు సాధించి ముంబయిని ఆలౌట్‌ చేశారు. టైటాన్స్‌లో ఆశలు చిగురింపజేశారు.

 ప్రో కబడ్డీ లీగ్

ప్రో కబడ్డీ లీగ్

ఆ జట్టు 24-27తో విజయానికి దగ్గరిదాకా వచ్చినా.. చివరి నిమిషంలో ముంబా జాగ్రత్త పడింది. టైటాన్స్‌కు ఒకే పాయింటును ఇచ్చుకుంది.

కొద్దిలో చేజారిన 'తెలుగు': చంద్రబాబు-అమీర్ ఖాన్ హల్‌చల్ (పిక్చర్స్)

కొద్దిలో చేజారిన 'తెలుగు': చంద్రబాబు-అమీర్ ఖాన్ హల్‌చల్ (పిక్చర్స్)

కొద్దిలో చేజారిన 'తెలుగు': చంద్రబాబు-అమీర్ ఖాన్ హల్‌చల్ (పిక్చర్స్)

English summary
U Mumba Hold Their Nerves to Beat Telugu Titans in Pro Kabaddi League.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X