ఇంటికి ఉదయ్ కిరణ్ మృతదేహం, బంధువు లొంగుబాటు

పెద్దల కలహాన్ని మనసులో పెట్టుకొని అతను ఈ బాలుడిని హత్య చేశాడు. టైతో ఉరేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. శుక్రవారం సాయంత్రం ఉదయ్ కిరణ్ మృతదేహం ఇంటికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు నిందితుడు నవీన్ ఉంటి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు దాడికి కూడా యత్నించారు.
కాగా, ఇటీవల కనిపించకుండా పోయిన ఉదయ్ కిరణ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. నిందితుడిని నవీన్‌గా గుర్తించారు. అతని వరుసకు ఉదయ్‌కి బాబాయ్ అవుతాడని తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బాటసింగారంలో 7వ తరగతి చదువుతున్న ఉదయ్‌ని తన స్నేహితుల సహకారంతో కిడ్నాప్ చేసి, గొంతునులిమి హత్య చేసినట్టు నవీన్ అంగీకరించాడు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications