పవన్ కల్యాణ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశ రాజకీయాలను తాకింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న దుమారం తగ్గట్లేదు. దీనిపై సినీ , రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ విషయమై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. 11 రోజుల తర్వాత స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభ ఎంతో ముఖ్యమైందని పవన్ కల్యాణ్ చెబుతూ వచ్చారు.సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి సంబంధించి డిక్లరేషన్ ప్రకటించారు. హిందూ దేవాలయాలకు ప్రత్యేక చట్టాలు , నిధలు తీసుకురావాలని పవన్ కల్యాణ్ కోరారు.

సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారని పవన్ చెప్పుకొచ్చారు.తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు , డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని, దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఆయన ఉదయనిధి పేరు ప్రస్తావించనప్పటికీ తమళనాట దీనిపై చర్చ మొదలైంది. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని ఉదయనిధి స్టాలిన్ కోరగా ఆయన'వెయిట్ అండ్ సీ' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదంపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుందని సూచించారు.
#WATCH | On Andhra Pradesh Deputy CM Pawan Kalyan's remark 'Sanatana Dharma cannot be wiped out and who said those would be wiped out', Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin says "Let's wait and see" pic.twitter.com/YUKtOJRnp9
— ANI (@ANI) October 4, 2024
సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నిరసన వ్యక్తం అవుతోంది. ఎటువంటి తప్పు చేయకుండానే హీరో కార్తీతో క్షమాపణలు చెప్పించారని భావిస్తోన్న ప్రజలు పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై కామెంట్స్ చేయడంతో అక్కడి ప్రభుత్వ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications