కృష్ణా, మూసీ నదుల్లో రెండు కాళ్లు: బాబుపై ఉమ్మారెడ్డి

Ummareddy Venkateswarlu
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు మూసీ నదిలో ఓ కాలు, కృష్ణా నదిలో మరో కాలు పెట్టారని, అలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దిగుజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తన బస్సు యాత్రలో ఏనాడైనా జై ఆంధ్ర అన్నారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జదన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్సించారు.

సమైక్యం ముసుగు ధరించి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ఆయన అన్నారు. నాలుగేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ 46 చోట్ల పోటీ చేస్తే 26 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెసుకు పడడం వల్లే ఆ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆయన అన్నారు ఆనాడే అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉండేదని ఉమ్మారెడ్డి అన్నారు.

సిఎంపై చర్య తీసుకోవాలి: హరీష్

కానిస్టేబుల్ జై తెలంగాణ అంటే తప్పేమిటని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు. అదే తప్పయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర అనడం కూడా తప్పేనని ఆయన అన్నారు. ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

సీమాంధ్ర విద్యుత్తు ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగారు. సమ్మె వల్ల తెలంగాణలో కరెంట్ కోతలు పెడితే సహించబోమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+