• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

|

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'కారులో బ్లాక్ మనీ తరలింపు' అనూహ్య మలుపులు తిరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన కారులో రూ.5.20 కోట్ల నగదు పట్టుపడటం, అది మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ద్వారా హవాలా కోసం పంపిన బ్లాక్ మనీ అని విపక్ష నేతలు ఆరోపించడం, దానిని మరింత వివాదం చేస్తూ.. ఈ వ్యవహారంలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి లింకులు ఉన్నాయని టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అదే స్థాయిలో ఎదురుదాడి చేశారు.

దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

గత వారం ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో.. చైన్నైకి సమీపంగా పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని రూ.5.2 కోట్ల నగదు పట్టుపడింది. ఆ డబ్బు తనదేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు మీడియా ముందకు వచ్చారు. నగదు పట్టుబడిన కారుపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టిక్కర్‌ను తన డ్రైవరే అతికించినట్లు ఆయన చెప్పారు. అయితే, వ్యాపారి బాలు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరి వ్యక్తి కావడంతో దీనిపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. మంత్రి బాలినేని బ్లాక్ మనీని హవాలాకు తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై వైసీపీ సైతం గట్టిగానే విమర్శల్ని తిప్పికొట్టింది. అంతలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొన్ని ఆధారాలను బయటపెట్టారు..

వైఎస్ భారతి రెడ్డి కంపెనీకి..

వైఎస్ భారతి రెడ్డి కంపెనీకి..

‘‘ఏపీలో కొల్లగొట్టిన కోట్ల కొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడింది. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది? ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్ళేది నిజమేనా? ఇవిప్పుడు తేలాలి. చెన్నైలో ఒకే అడ్రస్ తో ఉన్న ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీలకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిది. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేసారు. అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా. అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్ళించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం. ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే! ఇప్పుడూ అదే నడుస్తోంది. ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి'' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

షాకింగ్: సచివాలయం కింద గుప్త నిధులు.. రంగంలోకి నిజాం వారసులు.. రేవంత్ రెడ్డి.. తొండ వల్ల..

బాబుపై ఐటీ దాడి ప్రస్తావన..

బాబుపై ఐటీ దాడి ప్రస్తావన..

వైఎస్ భారతితోపాటు తన పేరునూ ప్రస్తావిస్తూ నారా లోకేశ్ చేసిన ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. గతంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు, లెక్కలోకి రాని రూ.2000 కోట్లు బయటపడటం, ఇటీవల టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు. ‘‘మీ నాన్న పీఎస్‌ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్లకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్‌ అకౌంటా?'' అని సాయిరెడ్డి ప్రస్తావించారు.

లోకాయ్.. లోకజ్ఞానం నేర్చుకో

లోకాయ్.. లోకజ్ఞానం నేర్చుకో

నారా లోకేశ్ ను లోకాయ్ అని సంబోధిస్తూ వైసీపీ ఎంపీ తన విమర్శలు కొనసాగించారు. వైఎస్ భారతికి బ్లాక్ మనీ లింకులు ఉన్నాయంటూ లోకేశ్ ప్రస్తావించిన ఫారెస్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిమ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు అక్రమమైనవి కాదు.. సక్రమమైనవేనని స్పష్టం చేశారు. ‘‘స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీల్లో చదువుకున్నానని అంటావ్ సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్‌ కంపెనీలు అనరు నాయనా. కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్‌..'' అంటూ హితబోధ చేశారు.

  YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
  సజ్జల దెబ్బతో సాయిరెడ్డికి మెంటల్..

  సజ్జల దెబ్బతో సాయిరెడ్డికి మెంటల్..

  చెన్నై సమీపంలో పట్టుపట్ట బ్లాక్ మనీ విషయంలో వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు ముప్పేటదాడి చేస్తున్నాయి. అటు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపైనా మాటల దాడి కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో సాయిరెడ్డిని వదలకుండా పంచ్ లు విసిరే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి తన పదాలకు పదునుపెట్టారు. ‘‘సీఎం జగన్ కారులో నుంచి తోసేశాక విజయసాయిరెడ్డి మానసికంగా దెబ్బతిన్నారు. తాజాగా వైసీసీ కేంద్ర కార్యాలయం బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించడంతో పార్టీ గేట్లు మూసుకుపోయినట్లయి.. సాయిరెడ్డికి మెంట‌లెక్కి ట్విట్ట‌ర్‌లో రెచ్చిపోతున్నారు. చెన్నై సూట్ కేసు కంపెనీల‌కు హ‌వాలా మార్గంలో త‌ర‌లిస్తున్న డ‌బ్బే ప‌ట్టుబ‌డింద‌ని తాడేప‌ల్లి టాక్‌. ఇక నిమ్మగడ్డ వ్యవహారంలో.. 11 చార్జిషీట్లు ప‌డి ఏ2 సూట్‌కేసురెడ్డిగా పేరుప‌డిన నువ్వా మ‌ండ‌లి ప్ర‌తిప‌క్ష‌నేత, బీసీ మేధావి, మాజీ స్పీక‌ర్‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల అర్హ‌త‌లు నిర్ణ‌యించేది?'' అని బుద్ధా వెంకన్న ఫైరయ్యారు.

  English summary
  TDP continues attack on ysrcp over seizure of Rs 5.5cr unaccounted cash from ap minister Balineni Srinivasa Reddy's car. ysrcp mp vijayasai reddy slams nara lokesh for criticizing cm jagan and his wife ys bharathi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X