చిన్నారిపై బాబాయ్ అత్యాచారం: వరంగల్‌లో గుంటూరు మహిళా దొంగ పట్టివేత
గుంటూరు : నాలుగేళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి వల్లెపు యేసుబాబు అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం గుంటూరులోని నెహ్రూనగర్‌లో జరిగింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం పిల్లలను ఇంట్లో వదిలి పనికివెళ్లారు.
ఇంటి వెనుకే నివాసం ఉండే యేసుబాబు ఆ చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత బాలికను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెంకు చెందిన గుంజ పద్మను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు.
ఒంటరిగా ఉన్న మహిళల నుంచి గొలుసులు, ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో పిల్లలను మంచి చేసుకుని బీరువాలు తెరిపించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లడంలో పద్మ నైపుణ్యం సంపాదించింది. ఇలా చోరీ చేసిన ఆభరణాలను శుక్రవారం హన్మకొండలో విక్రయించేందుకు రాగా పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె నుంచి 21 తులా ల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications