Undavalli Arun Kumar: ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెలువడ్డాయి. వీటిలో జాతీయ స్ధాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. అలాగే ఏపీలో మాత్రం కూటమి అధిక స్ధానాలు కైవసం చేసుకుంటుందని తెలిపాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని కొందరు, కూటమే గెలుస్తుందని మరికొన్ని సర్వేలు తేల్చాయి. వీటిపై కాంగ్రెస్ మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ స్పందించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విభజన జరిగి పదేళ్లయినా ఏపీ సమస్యలు అలాగే ఉన్నాయని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ.. పదేళ్లలో రెండు ప్రభుత్వాలను చూశామని, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని ప్రభుత్వాలు ఎందుకన్నారు.

గతంలో చంద్రబాబు ధర్మపోరాటం చేసినా, ఈ ఐదేళ్లలో జగన్ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని ఉండవల్లి తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడుకునే పరిస్ధితి ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం అసెంబ్లీలో జగన్, చంద్రబాబుల్లో ఒకరు ఉంటే మరొకరు ఉండరని ఉండవల్లి తెలిపారు. అలాంటి పరిస్ధితి ఉండకూడదని కోరుకుంటున్నట్లు ఉండవల్లి తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఓడినవాడు సర్వనాశనం ఏమీ కాడని గుర్తుచేశారు. గతంలో వాజ్ పేయ్, ఎన్టీఆర్ వంటి వారు ఓడినా ఆ తర్వాత గెలిచారన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నారు. గెలిచేది ఎవరైనా అధికారం తమ వ్యక్తిగతం కోసం కాకుండా జనం కోసం ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications