సెల్ఫ్ గోల్!: పద్ధతి కాదు.. జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉండవల్లి

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు.

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు.

Recommended Video

    అసెంబ్లీలో టిడిపి వ్యూహం : వైసీపీ నేతల గురించి మాట్లాడకూడదని ఇలా...! | Oneindia Telugu

     జగన్‌ను తప్పుబట్టిన ఉండవల్లి

    జగన్‌ను తప్పుబట్టిన ఉండవల్లి

    వైసిపి తీసుకున్న నిర్ణయం సరికాదని ఉండవల్లి తప్పుబట్టారు. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. జగన్ అసెంబ్లీని బహిష్కరించడాన్ని టీడీపీ నేతలు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

     జగన్ పాదయాత్ర విజయవంతం కావాలి

    జగన్ పాదయాత్ర విజయవంతం కావాలి

    అదే సమయంలో వైయస్ జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు. వైసిపి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

     అందుకే జగన్ అలా

    అందుకే జగన్ అలా

    ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. వైసిపి నుంచి గెలిచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని, దానికి నిరసనగా తాము సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పారు.

     సెల్ఫ్ గోల్ అని టీడీపీ, ఉండవల్లి ఇలా

    సెల్ఫ్ గోల్ అని టీడీపీ, ఉండవల్లి ఇలా

    అయితే, ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీయాల్సిన సమయం వచ్చినప్పుడు వైసిపి పారిపోతోందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సమావేశాలకు హాజహరుకావొద్దనే నిర్ణయం సెల్ఫ్ గోల్ అన్నారు. ఇప్పుడు ఉండవల్లి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+