వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లి

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లి

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట మాట్లాడితే సర్రున వెళ్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పినందువల్లే ఇన్ని రోజులుగా పార్లమెంటు స్తంభించి పోయిందన్నారు. ఆయన ఏం మాట్లాడినా అలా వెళ్తోందన్నారు.
ప్రభుత్వం మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన 'ఎవరి రాజధాని అమరావతి' అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐవైఆర్ కృష్ణారావు, సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాసిన 'ఎవరి రాజధాని అమరావతి' పుస్తకాలను పవన్ ఆవిష్కరించి ఆ కాపీలను పలువురికి అందించారు.

భ్రష్టు పట్టిస్తారా, కండకావరమా: మోడీపై బాబు తీవ్రవ్యాఖ్యలు, జగన్ కేసులపై కేంద్రమంత్రి ఇలాభ్రష్టు పట్టిస్తారా, కండకావరమా: మోడీపై బాబు తీవ్రవ్యాఖ్యలు, జగన్ కేసులపై కేంద్రమంత్రి ఇలా

ఆయనకు అన్ని విషయాలు తెలుసు

ఆయనకు అన్ని విషయాలు తెలుసు

ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వర రావుకు అంకితమివ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పుస్తకం చదవగానే రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుస్తాయన్నారు. అవినీతి మచ్చలేని, నిజాయతీ గల ఐవైఆర్ కృష్ణారావుకు అన్ని విషయాలు తెలుసునని, ఆయన నిజం చెబుతుంటే 'ద్రోహులు, దుర్మార్గులు, ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ ఆయనపై ఆరోపణలు చేస్తున్నరని మండిపడ్డారు.

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగిపోయింది

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగిపోయింది

ఇప్పుడు ఏపీలో పవన్ ఏం మాట్లాడినా సర్రున వెళ్తోందని ఉండవల్లి అన్నారు. అవిశ్వాసం విషయమై పార్లెమంటు ఎన్ని రోజులు ఆగిపోయిందో చూశామన్నారు. అవిశ్వాస తీర్మానం మేము పెడతామంటే మేము పెడతామంటున్నారని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం పవన్ కళ్యాణే అన్నారు.

మీ మధ్య గొడవేంటి, ఆ ద్రోహం చేయవద్దు

మీ మధ్య గొడవేంటి, ఆ ద్రోహం చేయవద్దు

ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడితే నమ్మక ద్రోహం అంటారని, పవన్ మాట్లాడితే ఇన్నాళ్లకు మెలకువ వచ్చిందా అంటారని ఉండవల్లి టీడీపీని ప్రశ్నించారు. అసలు, చంద్రబాబుకు, బీజేపీకి మధ్య ఉన్న గొడవేంటో చెప్పాలని నిలదీశారు. ఈ పాచిపోయిన లడ్డూలతో సర్దుకు పోవాలా అని పవన్ ఎప్పుడో ప్రశ్నించారన్నారు. ఈ సమయంలో పవన్ రాజకీయాల్లోకి రావడం పెద్ద రిస్క్ అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఆశీర్వదించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఒక మనిషి దెబ్బలాడేందుకు బయటకు వచ్చినప్పుడు, ఆ మనిషి వెనుక మనం నిలబడకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవాళ్లమవుతామని, ఆ ద్రోహం చేయవద్దన్నారు.

అందరినీ సమానంగా చూడాలి

అందరినీ సమానంగా చూడాలి

పవన్ మాట్లాడుతూ.. అమరావతిలో బుద్ధుడి బొమ్మ ఉండాలని సర్కారు చెబుతోందని, బుద్ధుడి స్ఫూర్తి కూడా ఉండాలన్నారు. బుద్ధుడు జీవహింస చేయలేదని, ఎవరినీ హింసించలేదన్నారు. బుద్ధుడు అందరినీ సమానంగా చూశాడన్నారు. సృష్టి అంతా సమానమేనని బుద్ధుడు చెప్పాడని, అదే స్ఫూర్తిని అమరావతి నిర్మాణంలో కనబరచాలని సూచించారు. నిజమైన బుద్ధుడి స్ఫూర్తినే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అందరికీ న్యాయం చేయాలని, రాజధానిలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి సరే

హైదరాబాద్ అభివృద్ధి సరే

చంద్రబాబు సమైక్య ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే తప్పు చేస్తున్నారని పవన్ అన్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేవలం సైబరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా అంతే విధ్వంసం కూడా జరిగిందన్నారు. చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారన్నారు.

సీమ, కళింగ ఉద్యమాలపై హెచ్చరిక

సీమ, కళింగ ఉద్యమాలపై హెచ్చరిక

దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని, ఏపీ ప్రజలపై తెలంగాణవాసుల కోపానికి కారణం అదేనని పవన్ అన్నారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందన్నారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందన్నారు. మంగళగిరి అటవీ ప్రాంతంలో 1800 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని చెప్పిన చంద్రబాబు అన్ని వేల ఎకరాలు ఎందుకు సమీకరించారని నిలదీశారు. మహానగరాలు రాత్రికి రాత్రి నిర్మితం కాలేదని గుర్తించాలన్నారు.

English summary
Former MP Undavalli Arun Kumar has praised Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X