ఇంకా ఘోరాలేనా?: నగరంలో టెక్కీ రేప్‌పై బాబు, జగన్

ఢిల్లీ సంఘటన తర్వాత మహిళలపై అత్యాచారాల నివారణకు నిర్భయ చట్టం తెచ్చినా ఇంకా ఇటువంటి ఘోరాలు కొనసాగుతుండటం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హైటెక్ సిటీలో పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగినులు తిరుగుతూనే ఉంటారని, అక్క డ కూడా సిసి కెమెరాలు నామమాత్రంగా తయారవడం, నిఘా లోపించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తీవ్రంగా పరిగణించాలి: జగన్
అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణించాలని వైయస్ జగన్ అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అపహరణ సంఘటన దారుణమన్నారు. ఉద్యోగినిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలోని డిమాండ్ చేశారు. రేపిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంభించాలన్నారు. ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పోలీసులతో పౌర సమాజం కలిసి పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications